‘హలాల్‌ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

‘హలాల్‌ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published Mon, Dec 18 2023 1:25 PM

Central Minister Giriraj Singh Sensational Comments On Halal Meet - Sakshi

బెగూసరాయ్‌: ‘సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్‌ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్‌ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కోరారు. ఈ విషయమై సింగ్‌ సోమవారం బీహార్‌లోని బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడారు.

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని  సింగ్‌ తెలిపారు. పార్లమెంట్‌లో జరిగిన దాడి రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్‌కిట్‌ గ్యాంగ్‌ హస్తం ఉందని ఆరోపించారు. 

‘పార్లమెంట్‌లో దాడి ఘటనపై విచారణ జరుపుతున్నాం.దీనికి కారణమైన వాళ్లు ఎవరో త్వరలో తేలుతుంది. రైతుల ఉద్యమ సమయంలో టూల్‌కిట్‌ గ్యాంగ్‌ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్‌ ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో తెలుస్తుంది’అని గిరిరాజ్‌ అన్నారు. 

ఇదీచదవండి..పార్లమెంట్‌ సమావేశాల అప్‌డేట్స్‌.

Advertisement
 
Advertisement