
బెంగళూరు: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 22న విచారణ నిమిత్తం తమముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మెయిల్ ద్వారా జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు పంపింది.
2014లో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన నారదా స్టింగ్ ఆపరేషన్ 2016లో వెలుగులోకి వచ్చింది. బెంగాల్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జులైలోనే నోటీసులిచ్చినప్పటికీ తాను అమెరికాలో ఉన్నందున విచారణకు రాలేనని సామ్యూల్ బదులిచ్చారు. దీంతో సీబీఐ ఆయనకు మళ్లీ నోటీసులు ఇచ్చింది.