కవితకు బ్యాడ్‌ టైమ్‌.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

కవితకు బ్యాడ్‌ టైమ్‌.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Published Tue, Apr 16 2024 7:59 AM

BRS MLC Kavitha Regular Bail Petetion Hearing On Special Court - Sakshi

ఢిల్లీ: నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవులో ఉండటం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 22వ మధ్యాహ్నం పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 

ఇక​, రెగ్యులర్‌ బెయిల్ పిటిషన్‌లో భాగంగా కవిత.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్‌ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. 

మరోవైపు.. కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి..‘కవిత లిక్కర్‌ కేసులో కింగ్‌ పిన్‌ అని, ఆప్‌-సౌత్‌ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారు. లిక్కర్‌ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర. ఇండో స్పిరిట్‌ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్‌ బ్యాగ్స్‌ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్‌లో డేటాను డిలీజ్‌ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

అలాగే, ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్‌ డేటాను డిలీట్‌ చేశారు. డిజిటల్‌ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. అరుణ్‌ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. ఆమెకు బెయిల్‌ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరు. సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్‌ ఇవ్వకూడదు’ అని కోరుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement