దారుణం: ఆరు నెలల బిడ్డను బలి ఇచ్చిన అవ్వ | Black Magic: Family Members Assassinated 6 Months Child Tamilnadu | Sakshi
Sakshi News home page

దారుణం: ఆరు నెలల బిడ్డను బలి ఇచ్చిన అవ్వ

Dec 19 2021 12:30 PM | Updated on Dec 19 2021 12:36 PM

Black Magic: Family Members Assassinated 6 Months Child Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: యాభై ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం కోసం మూఢనమ్మకంతో ఆరు నెలల బిడ్డను బలి ఇచ్చిన మంత్రవాది సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా పేరావూరని, మల్లిపట్టినం చెందిన అస్రుద్ధీన్‌ (32) కార్మికుడు. ఇతని భార్య షాలిషా (24). వీరికి రాజామహ్మద్‌ అనే ఆరు నెలల ఆడబిడ్డ ఉంది.

ఈ క్రమంలో నస్రుద్ధీన్‌ పిన్ని షర్మిల బేగం (48) తన భర్త ఆరోగ్యం బాగుపడటానికి కేరళ మంత్రవాది మహ్మద్‌ సలీం (48) సలహా మేరకు నస్రుద్ధీన్‌ కుమార్తె అయిన చిన్నారిని బలి ఇచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు షర్మిళ బేగం, అస్రుద్ధీన్, మంత్రవాది మహ్మద్‌ను శనివారం అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement