గంగానదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి | Bihar Ganga River Boat Accident | Sakshi
Sakshi News home page

గంగానదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి

Oct 13 2026 10:52 PM | Updated on Oct 13 2026 10:55 PM

Bihar Ganga River Boat Accident

బిహార్‌: రాష్ట్రంలోని రాఘెపూర్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగానదిలో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడటంతో 10 మంది మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదంలో మరికొంత మంది గల్లంతైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు, పడవలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement