రద్దీ రోడ్డు.. ట్రాఫిక్‌ జామ్‌ కాకూడదని.. బస్‌ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ!

Bengaluru Acp Drives Bus When Driver Falls Ill - Sakshi

బెంగళూరు: బెంగ‌ళూరులో బ‌స్సు డ్రైవ‌ర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో..  ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్ర స్వయంగా బ‌స్సు న‌డిపారు. అసలు ఏం జరిగిందంటే.. బెంగ‌ళూరులో విప‌క్ష పార్టీల స‌మావేశం జ‌రిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి విప‌క్ష పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు.

వీవీఐపీల (ప్రతిపక్ష నేతల సమావేశం) షెడ్యూల్‌ కారణంగా ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నిర్వహణ బాధ్యతను ఏసీపీ రామచంద్ర చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా రూట్ 330  డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఆ  బ‌స్సును రోడ్డుపైనే ప్ర‌యాణికుల‌తో స‌హా నిలిపివేశారు. తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ రామచంద్ర.. అనారోగ్యంతో ఉన్న ఆ డ్రైవర్‌ను బోవరింగ్ ఆసుపత్రికి తరలించి, వైద్య సహాయం అందించేలా అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

బస్సు రోడ్డుపై నిలిచిపోయిన కారణంగా ట్రాఫిక్ రద్దీకి కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించి.. ఏసీపీ ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను స్వయంగా తానే తీసుకున్నారు. డ్రైవర్‌ సీటులో కూర్చుని బస్సును ఒక కిలోమీటరుకు పైగా నడుపుతూ కార్పొరేష‌న్ పార్కింగ్ ప్ర‌దేశంలో బ‌స్సును పార్క్‌ చేశారు. ఇదంతా బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్‌ చేయ‌గా అది కాస్త వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏసీపీ స్పందించిన తీరుపై అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి  ఆస్ట్రేలియా బీచ్‌లో చంద్రయాన్‌-3 రాకెట్‌ శకలం.. ఇస్రో చీఫ్‌ క్లారిటీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top