
తమిళనాడు: మద్యం మత్తులో ఓ యువతి ఎదుట నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యశాల డాక్టర్‌ను బస్సులోని ప్రయాణికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం రాత్రి కలకలం రేపింది. తిరువళ్లూరు బస్టాండు నుంచి శ్రీపెరంబదూరుకు బుధవారం రాత్రి పది గంటలకు ప్రభుత్వ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
బస్సు కామరాజర్ విగ్రహం వద్ద వచ్చిన క్రమంలో అప్పటికే మద్యం మత్తులో వున్న వ్యక్తి నగ్నంగా మారి యువతి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు నగ్నంగా ఉన్న వ్యక్తిని చూసి షాక్‌కు గురి కావడంతో పాటూ అతడ్ని చితకబాది దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు చేపట్టిన విచారణలో మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి శ్రీపెరంబదూరుకు చెందిన మదియగళన్‌గా గుర్తించారు. ఇతను అరక్కోణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తున్నట్టు నిర్ధారించారు. కాగా బస్సులో నగ్నంగా మారి యువత ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యుడి వ్యవహార శైలి స్థానికంగా కలకలం రేపింది. కాగా నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు.