Ayodhya Ram Mandir Trust Formally Invites PM Modi For Idol Consecration In January - Sakshi
Sakshi News home page

అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం

Jul 28 2023 5:47 AM | Updated on Jul 28 2023 1:37 PM

Ayodhya Ram Mandir Trust Formally Invites PM Modi For Idol Consecration In January - Sakshi

అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు.

వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement