ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్‌ హోటళ్లు! | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్‌ హోటళ్లు!

Published Tue, Jan 16 2024 1:24 PM

Ayodhya India First Seven Star Hotel to Open in Ayodhya - Sakshi

అయోధ్యలో నూతన రామమందిరం రాకతోనే  పలు ప్రాజెక్టులు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. అయోధ్యలో నూతన రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పుడు దేశంలోనే అత్యంత విలాసవంతమైన తొలి సెవెన్‌ స్టార్ హోటల్‌ను అయోధ్యలో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ విలాసవంతమైన హోటల్ విదేశీయులకు, ప్రముఖులకు అనువైన వసతిని అందించనుంది. ఇక్కడ విశేషమేమంటే ఈ  సెవెన్ స్టార్ హోటల్‌లో కేవలం శాకాహారం మాత్రమే అందించనున్నారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయోధ్యలో రామమందిర సందర్శనకు పర్యాటకుల రద్దీ అధికంగా ఉండనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు ఈ ప్రాంతంలో  స్థార్‌ హోటళ్లను నిర్మించేందుకు నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. జనవరి 22 నుంచి అయోధ్యలో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. సెవెన్ స్టార్ హోటల్‌తో పాటు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్‌ సంస్థ మరో ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనున్నదని తెలుస్తోంది. దీనితో పాటు పలు చిన్న హోటళ్ళు కూడా ఇక్కడ ‍ప్రారంభంకానున్నాయి. 

‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ సంస్థ జనవరి 22న ‘ది సరయూ’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. 45 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో నది ఒడ్డున విలాసవంతమైన హోటల్‌ కూడా నిర్మితం కానుంది. ఇక్కడ పలు ఇళ్లు కూడా నిర్మించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని రూ. 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే అయోధ్యలో త్వరలో నిర్మితమయ్యే విలాసవంతమైన హోటళ్లు ముంబై, ఢిల్లీలలోని ‍స్టార్‌ హోటళ్లను తలదన్నేలా ఉండనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 
ఇది కూడా చదవండి: అయోధ్య రామాలయం రెడీ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement