రోడ్‌ రోలర్‌ నడిపిన సీఎం హిమంత | Assam CM Himanta Biswa Sarma drives road roller to crush seized drugs | Sakshi
Sakshi News home page

రోడ్‌ రోలర్‌ నడిపిన సీఎం హిమంత

Jul 13 2026 5:35 AM | Updated on Jul 13 2026 5:35 AM

Assam CM Himanta Biswa Sarma drives road roller to crush seized drugs

గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రోడ్డు రోలర్‌ నడిపారు. అదేదో నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం కాదు. మాదక ద్రవ్యాల విధ్వంసం కోసం. రాష్ట్రంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రాష్ట్రం రూ. 472.51 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాదీనం చేసుకుంది. 

వాటిని ధ్వంసం చేసే కార్యక్రమం గువాహటి శివార్లలో మంత్రులు, అస్సాం సీనియర్‌ పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగింది. ఇందులో భాగంగా మంత్రి హిమంత రోడ్‌ రోలర్‌ను నడిపి మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. మాదకద్రవ్యాలపై తమ పోరాటం నిరంతరాయంగా సాగుతుందని చెబుతూ ఆ వీడియోను తన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement