ప్రభుత్వం ఏర్పాటు చేయండి | Himanta Biswa Sarma officially appointed Assam CM | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఏర్పాటు చేయండి

May 11 2026 6:23 AM | Updated on May 11 2026 6:23 AM

Himanta Biswa Sarma officially appointed Assam CM

హిమంతను ఆహ్వానించిన అస్సాం గవర్నర్‌

గువాహటి: అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా హిమంత బిశ్వ శర్మను గవర్నర్‌ లక్ష్మణ్‌ ఆచార్య ఆదివారం ఆహ్వానించారు. దీంతో రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఎన్డీయేకు మార్గం సుగమమైంది. అంతకుముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే శాసనసభాపక్ష నాయకుడిగా హిమంత ఎన్నికయ్యారు. 12న హిమంత, కొందరు మంత్రులతో గవర్నర్‌ ఆచార్య ప్రమాణం చేయిస్తారని లోక్‌భవన్‌ తెలిపింది. ఖానాపారాలోని కళాశాల మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు  హాజరు కానున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement