breaking news
Assam governor
-
పేలుడు కేసు నిందితుడికి ఎంఏ గోల్డ్మెడల్
గువాహటి: బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి ఒకరికి అస్సాం గవర్నర్ బంగారు పతకం అందజేశారు. 2019లో గువాహటిలో తీవ్రవాద సంస్థ ఉల్ఫా జరిపిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్లో ఒకరైన సంజీవ్ తాలూక్దార్ (29) ప్రస్తుతం జైలులో ఉన్నాడు. జైల్లోంచే ఓపెన్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. అంతేగాక అత్యధికంగా 71% మార్కులు సాధించాడు! గురువారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జగ్దీశ్ ముఖి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. -
అసోం గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు!
గువాహటి: హిందుస్థాన్ హిందువుల దేశమని, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజెన్స్ (ఎన్సీఆర్) ఆధునీకరణలో ఒక్క బంగ్లాదేశీ పేరు కూడా నమోదుచేయకుండా చూడాలని అసోం గవర్నర్ పీబీ ఆచార్య పేర్కొన్నారు. ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీఆర్ ఆధునీకరణలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన శరణార్థులకు భారత్లో ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీచేయడంపై వివాదం తలెత్తగా.. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు భారత్లో ఆశ్రయం పొందవచ్చునని, ఇతర దేశాల్లోని హిందువుల్లో భారత్లో ఆశ్రయం పొందడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. 'హిందుస్థాన్ హిందువుల దేశం. ఈ విషయంలో ఏ సందేహాలకు తావు లేదు. వివిధ దేశాల్లోని హిందువులంతా ఇక్కడ నివసించవచ్చు. ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, వారికి ఎలా ఆశ్రయం కల్పించాలన్నదే పెద్ద ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది' అని ఆయన పేర్కొన్నారు.