
గువాహటి: బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి ఒకరికి అస్సాం గవర్నర్ బంగారు పతకం అందజేశారు. 2019లో గువాహటిలో తీవ్రవాద సంస్థ ఉల్ఫా జరిపిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్లో ఒకరైన సంజీవ్ తాలూక్‌దార్ (29) ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
జైల్లోంచే ఓపెన్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. అంతేగాక అత్యధికంగా 71% మార్కులు సాధించాడు! గురువారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జగ్దీశ్ ముఖి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు.