బెంగాల్‌లో అమిత్‌ షా పర్యటన

Amit Shah Has Lunch At House Of Tribal - Sakshi

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడెక్కుతుంది. త్వరలోనే అసెంభ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా పార్టీకి బలం చేకూర్చడాని ఇప్పటి నుంచే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెటింది. దీనిలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలు బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. 2021 ఏఫిల్‌-మే మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  బెంగాల్‌లో పర్యటించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాస్తవాని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా  రావల్సి ఉండగా దాన్ని ఆపి మరీ అమిత్‌ షా పర్యటన ఖరారు చేశారు. లాక్‌ డౌన్‌ తర్వాత షా బెంగాల్‌ రావడం ఇదే తొలిసారి. చివరగా ఈ ఏడాది మార్చి 1న బెంగాలో పర్యటించారు. రాష్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని గవర్నర్‌ జగధీశ్‌ ధన్‌కర్‌ మమత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నఈ సమయంలో అమిత్‌ షా పర్యటించడం చర్చనీయాంశం అయింది. రాబోయే ఎన్నికలకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, గెలుపుకు వ్యూహ రచన చేస్తూ ఎన్నికలు వచ్చే లోగా పార్టీని సంసిద్ధం చేయాలని షా భావిస్తున్నారు.

వివిధ ప్రాంతాలల్లో పర్యటించే సందర్భంలో షా కార్యకర్తల ఇంట్లో భోజనం చేస్తుంటారు. ఈ పర్యటనలో కూడా గురువారం గిరిజన బీజేపీ కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వర్గియా, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, రాష్ట్ర పార్టీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌లు షాతో పాటు పాల్గోన్నారు. బిభీషన్‌ ఇంట్లో నేలమీద కూర్చుని అరటి ఆకులో బెగాలీ సాంప్రదాయ శాఖాహార వంటకాలను హారగించారు. అమిత్‌ షా అన్నం, రోటీ, పప్పు,పొట్లకాయ వేపుడు, గసగసాలతో వండిన బంగాళదుంప, అప్పడాలతో భోజనం చేశారు. రసగుల్లా, మిష్‌తీ దోయ్‌ వంటి స్వీట్స ఉన్నప్పటికీ బీజేపీ నాయకులు వీటిని తినలేకపొయారు. భోజనం అనంతరం అమిత్‌ షా బిబీషన్‌ కుటుంబ సభ్యలతో, స్థానిక ప్రజతో కూలంకుశంగా చర్చించారు.

అంతకు ముందు బిబీషన్‌ ఇంటికి చేరుకోడాకి అమిత్‌ షా బుడద దారి గుండా రావాల్సి వచ్చింది. షా కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. శంఖం ఉదుతూ, టపాకాయలు పేల్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమిత్‌ షా పచ్చిమ బెంగాల్‌ వచ్చారు. గురువారం ఉదయం పార్టీ స్థితిగతులు తెలుసుకోడానికి బంకురా చేరుకునన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంస్థాగత సమావేశాలు నిర్వహించి, వివిధ వర్గాల, సామాజిక సమూహ ప్రతినిధులను కలుసుకోని మాట్లాడారు. కొన్ని దశాబ్ధాలు బెంగాల్‌లో ఎలాంటి గుర్తింపు లేని బీజేపీ, తృనమూల్‌ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 42 లోక్‌సభ సీట్లలో 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దశాబ్ధా కాలం నుంచి అధికారంలో ఉన్న మమత బెనర్జీని గద్దె దించాలని బీజేపీ వ్యూహ రచన చేస్తుంది. గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు అధికంగా ఉన్న బంకురా , 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలం చేకూర్చిన అనేక జిల్లాల్లో ఒకటి. ఇక్కడి నుంచి రెండు లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top