
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశం అంతటా వేడిగాలులుల వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మే 28 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తుంది. అలాగే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన శనివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల వీయనున్న కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మే 28 వరకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీయనున్న దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆ సమయంలో వేడిగాలులు ఉధృతంగా ఉంటాయని, వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని సలహా ఇచ్చింది.