ఆ చిత్రాలకు బానిస! నటించింది తన భార్యేమోనని.. | Addicted To Indicent Content Husband Suspect Wife Killed | Sakshi
Sakshi News home page

ఆ చిత్రాలకు బానిస! నటించింది తన భార్యేమోనని..

Apr 19 2022 3:48 PM | Updated on Apr 19 2022 4:32 PM

Addicted To Indicent Content Husband Suspect Wife Killed - Sakshi

ఆ చిత్రాలను బానిస అదే పనిలో ఉన్న భర్తకు.. భార్య మీద అనుమానం అనే పెనుభూతం కొంపముంచింది. 

బెంగళూరు: బూతు సినిమాలకు బానిసైన ఆ భర్త.. నీచ స్థితికి దిగజారాడు. తన భార్య క్యారెక్టర్‌ని అనుమానించి ఘోరానికి పాల్పడ్డాడు. పదిహేనేళ్లు కాపురం చేసిన భార్యను పిల్లల ఎదుటే కిరాతకంగా హతమార్చాడు. 

కర్ణాటకలో రామానగరలో ఈ ఘోరం చోటు చేసుకుంది. జహీర్‌పాషా(40) స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య ముబీనా, ఐదుగురు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చాలాకాలంగా సెల్‌ఫోన్‌లో అభ్యంతరకర చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నాడు అతను. ఈ క్రమంలో.. రెండు నెలల కిందట చూసిన ఓ వీడియోలో ఉంది తన భార్య ముబీనా(35)నే అని అనుమానం పెంచుకున్నాడు. 

అప్పటి నుంచి ఆమెను క్రూరంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రి పాలైంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముబీనా తండ్రి ముందుకు రాగా.. భర్తను కటకటాల వెనక్కి నెట్టొద్దని ఆమె వేడుకుంది. దీంతో అతన్ని మందలించి వదిలేశారు. అయినా జహీర్‌ తీరు మారలేదు. 

ఆదివారం మధ్యాహ్న సమయంలో మరోసారి ఇద్దరి మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో పిల్లల ఎదుటే ఆమెను దారుణంగా హతమార్చాడు జహీర్‌. అది చూడగానే జహీర్‌పాషా పెద్ద కొడుకు.. దగ్గర్లో ఉన్న తాత గౌష్‌ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం చెప్పాడు. వాళ్లు వచ్చి చూసేసరికి కూతురు విగత జీవిగా పడి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న జహీర్‌పాషా కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement