Adar Poonawala: మలేరియా వ్యాక్సిన్‌ తయారీపై ‘సీరమ్‌’ దృష్టి!

Adar Poonawala said After Corona now Emphasis on Making Malaria Vaccine - Sakshi

ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పూణె) మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తర్వాత తమ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించిందని తెలిపారు. 

మలేరియా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుందని అదార్ పూనావాలా తెలిపారు. సంస్థకు పది కోట్ల డోసుల మలేరియా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా దీనిని మరింత పెంచవచ్చన్నారు. 

మలేరియా వ్యాక్సిన్‌ తయారీలో టెక్నాలజీ బదిలీ ఒప్పందంతో పాటు వ్యాక్సిన్‌ల ఎగుమతిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ తయారీపై కూడా దృష్టిపెట్టామన్నారు. ఏటా లక్షల మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గతంలో కరోనా నివారణకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పుడు దీనికి డిమాండ్ తగ్గడంతో తక్కువ స్థాయిలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. 

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top