ప్రశ్నించిన నేతలను అరెస్టు చేయడం తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించిన నేతలను అరెస్టు చేయడం తగదు

Oct 8 2026 3:48 AM | Updated on Oct 8 2026 3:48 AM

● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌: కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమి నాయకులను అరెస్టు చేయడం కేంద్ర పాశవిక చర్యకు నిదర్శనమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాల ఆరోపణలు, ఓటరు జాబితా సవరణపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలను అణిచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని, ఎన్నికల సంఘం పారదర్శకతపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత శక్తివంతమైన ఆయుధమని.. ఓటుహక్కుపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా పని చేయాలని కోరారు. నియోజకవర్గంలో 70 వేల ఓట్లు కోల్పోవడం జరిగిందని.. ఎస్సీ, ఎస్టీ ఓట్లను అధికంగా తొలగిస్తున్నారని తెలిపారు. సర్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని.. దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఓటు హక్కు కాలరాయడం అంటే బతికున్న వ్యక్తిని చంపడమేనన్నారు. సమావేశంలో పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, గాయత్రి అనిల్‌, కట్టా సురేష్‌, వాకిటి హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల పనుల పరిశీల..

మండలంలోని గొల్లపల్లి శివారులో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణ పనులు బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పనులు నాణ్యతగా, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement