రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడి

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

● యజమానిపై కేసు నమోదు

నర్వ: మండలంలోని రాంపూర్‌గేట్‌ వద్ద ఉన్న సాయిరాం రైస్‌మిల్లులో శుక్రవారం పౌరసరఫరాలశాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించగా రూ.10.92 కోట్ల విలువైన ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించామని పౌరసరఫరాల డీఎం సైదులు తెలిపారు. అధికారులు అందించిన వివరాల మేరకు.. 2022–23 నుంచి 2025–26 వరకు రబీ, యాసంగి సీజన్‌లో అప్పగించిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్‌ను అప్పగించాల్సి ఉంది. అయితే ఇందులో లక్ష ఆరు వేల 536 బస్తాల ధాన్యం (రూ.10,92,05,027) తక్కువగా ఉండటంతో మిల్లు యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నర్వ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్‌ఐ పబ్బతి రమేష్‌ కేసు నమోదు చేసి సీఐ భగవంతురెడ్డి సమక్షంలో మిల్లు యజమాని, కుటుంబ సభ్యులను అరెస్టు చేసి హాజరుపర్చినట్లు సమాచారం.

ఆస్పత్రిలో

చిన్నారి మృత్యువాత

● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని

కుటుంబ సభ్యుల ఆరోపణ

నారాయణపేట: జలుబుతో బాధపడుతున్న మూడునెలల కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్తే చివరకు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బైరంకొండకు చెందిన వడ్డె బుజ్జమ్మ రెండో కుమారుడికి జలుబు చేయడంతో ఈ నెల 15న గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌లోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమంటూ నారాయణపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఓ రాజకీయ నాయకుడి జోక్యం చేసుకొని ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి రూ.2 లక్షల పరిహారానికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయంపై సంబంధిత ఆస్పత్రి వైద్యుడిని వివరణ కోరగా.. తమ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పుడు బాలుడు బాగానే ఉన్నాడని, మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. బాలుడికి అందించిన వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని చెప్పుకొచ్చారు.

వివరాలు IIIలో..

విద్యార్థుల ఆలోచనలకు పదును

ప్రాజెక్ట్‌ వీర్‌ గాథా 6.0తో ప్రయోగం

అన్ని యాజమాన్య పాఠశాలలకు

అవకాశం

విజేతలకు రూ.10 వేల నగదు

పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement