సరుకులు.. చురుకులు! | - | Sakshi
Sakshi News home page

సరుకులు.. చురుకులు!

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

మరికల్‌: నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నాలుగు నెలల కిందట వరకు అందుబాటులో ఉన్న నిత్యావసరాల ధరలు ఇప్పుడు చుక్కలను అంటుతుండటంతో ప్రతి నెలా ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి అంతంత మాత్రంగా ఉండటం.. డిమాండ్‌ మేరకు సరకులు రాకపోవడంతో వ్యాపారులు సైతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దసరా పండుగ వేళ అమాంతం ధరలు పెరగడంతో కూలీ పనులు చేసుకునే పేదలు, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఇతర సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పండుగ చేసుకోవాలంటేనే భయపడుతున్నారు.

సరుకుల వారీగా ధరలు ఇలా..

(సుమారుగా రూ.లలో..)

సరుకు గతం ప్రస్తుతం

కందిపప్పు 140 160

పెసరపప్పు 100 120

శనగపప్పు 80 100

చక్కెర 48 60

ఉల్లి 25 70

అల్లం 50 100

వెల్లుల్లి 120 200

బియ్యం

జైశ్రీరాం 6,500 9,000

సోనమసూరి 5,000 7,000

పండుగ వేళ మండుతున్న నిత్యావసరాల ధరలు

నాలుగు నెలల్లో భారీగా పెరిగిన వైనం

విలవిలలాడుతున్న సామాన్యులు

రూ.80కిలో చేరువలో సన్నబియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement