మక్తల్ – నారాయణపేట నాలుగు లేన్ల రోడ్డుకు రూ.237 కోట్లు మంజూరయ్యాయని చెబుతున్నా, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 30 కి.మీ. దూరానికి 45 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా.. రోడ్డు గుంతల కారణంగా గంట సమయం పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ప్రయాణం ఆలస్యమైతే రోగుల పరిస్థితి ఏమిటి. ప్రకటనలకే పరిమితం కాకుండా, వెంటనే పనులు ప్రారంభించాలి. – శ్రీనివాసులు,
పెద్దపొర్ల, ఊట్కూరు మండలం
త్వరలోనే పనులు ప్రారంభం
నారాయణపేట – మక్తల్ రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. సర్వే కొనసాగుతోంది. నాలుగు లైన్ల రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. – అభిలాష్రెడ్డి, ఆర్అండ్బీ ఏఈ, మక్తల్
●


