మాకు ఏడు నెలల క్రితమే సెర్ప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బస్సును మంజూరు చేసింది. దీనిని గద్వాల డిపోలో 84 నెలల వరకు లీజ్కు ఇచ్చాం. ప్రతి నెలా రూ.69వేల పైచిలుకు మండల మహిళా సమాఖ్య ఖాతాలో జమ అవుతున్నాయి. దీని ద్వారా ఇప్పటివరకు అద్దె రూపంలో రూ.5.50 లక్షలు సమకూరింది. ఈ డబ్బుల నుంచి మహిళా సభ్యులకు అవసరమైన సమయంలో రుణం ఇస్తున్నాం. ఇలా మాకు ఎంతో మేలు కలిగింది.
– మునెమ్మ, అధ్యక్షురాలు,
మండల మహిళా సమాఖ్య, మల్దకల్
మాకు కేటాయించిన బస్సును హనుమకొండ జిల్లా పరకాల డిపోలో లీజ్కు ఇచ్చాం. దీని ద్వారా ప్రతినెలా వచ్చే అద్డె మొత్తంలో రూ.50 వేలను ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. సామాజిక పెట్టుబడి నిధి (కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ –సీఐఎఫ్) రూపంలో రుణం కావాల్సిన మహిళా సభ్యులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన రూ.19 వేలను సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నాం.
– గోవిందమ్మ, అధ్యక్షురాలు, మండల మహిళా సమాఖ్య, నారాయణపేట
●


