నర్వ: తెలంగాణ రాష్ట్రస్థాయి ఖేలోఇండియా ఉమెన్స్ ట్రాక్ 500 మీటర్ల సైక్లింగ్ పోటీల్లో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. 14 ఏళ్లలోపు విభాగంలో దుర్గ కాంస్యం, 16 ఏళ్లలోపు విభాగంలో సౌజన్య 4వ స్థానం, మహేశ్వరీ, చందన, అఖిల, భవాని చక్కటి ప్రతిభ చాటా రన్నారు. మంగళవారం విజేతలకు జీహెచ్‌ఎం సునీత, జిల్లా ప్రధానకార్యదర్శి గోపాలం, పీఈటీ స్వరూప మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంపల్లి ఆంజనేయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


