వెళ్లిరా.. వినాయకా | - | Sakshi
Sakshi News home page

వెళ్లిరా.. వినాయకా

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

వినాయక చవితి సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు మక్తల్‌లో కొలువుదీరిన గణనాథులు 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్నారు. గురువారం రాత్రి

నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. మండపాల్లో విగ్రహాలకు ప్రత్యేక పూజలు, మంగళహారతులు ఇచ్చి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. గణపతి బప్పా మోరియా..

అంటూ భక్తుల నామస్మరణతో పుర వీధులు మార్మోగాయి. యువత, మహిళలు, చిన్నారులు అధికసంఖ్యలో ఊరేగింపులో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకొని పూజలు

నిర్వహించారు. వినాయక శోభాయాత్రతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. – నారాయణపేట/మక్తల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement