మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు,
పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు


