స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించం | - | Sakshi
Sakshi News home page

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించం

Sep 13 2026 12:48 AM | Updated on Sep 13 2026 12:48 AM

నారాయణపేట: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పదవిని కించపరిచేలా మాట్లాడటం ఒక వ్యక్తిని అవమానించడం కాదని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థనే అవమానించడమని టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్‌ యాదవ్‌, డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సీవీఆర్‌ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని.. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో పాటు భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు మళ్లీ పాత పాలన కోరుకోవడం లేదని.. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పాలననే కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణను రాజకీయ కలహాలకు కాకుండా అభివృద్ధి దిశగా నడిపించేందుకు కాంగ్రెస్‌ ముందుంటుందన్నారు. ప్రజల సమస్యలపై కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫామ్‌హౌస్‌లో కూర్చోకుండా అసెంబ్లీకి రావాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రెచ్చగొట్టే రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఫామ్‌హౌస్‌ ముట్టడికి వెళ్లివచ్చిన తర్వాత పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ సలీం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్‌, సరఫ్‌ నాగరాజ్‌, జి.సుధాకర్‌, మండల, పట్టణ అధ్యక్షులు కోట్ల రవీందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గొల్ల కృష్ణయ్య, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ గౌస్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఎండీ అఫ్రోజ్‌, బోయ శరణప్ప, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్‌ రాజేష్‌ ఘాట్‌, మాజీ కౌన్సిలర్‌ ఆమిరుద్దీన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement