ధన్వాడ: మావోయిస్టుల చేతిలో హతమైన మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి వర్ధంతిని శనివారం ధన్వాడలోఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్‌లో ఉన్న చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, నారాయణపేట మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోటపక్క వీధిలో ఉన్న ఆయన సమాధి (ఘాట్) వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో అన్నదానం నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోనూ..
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి విగ్రహాలకు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, చిట్టెం అభిజయ్‌రెడ్డి, మార్కెట్ చైర్మనన్ ఆర్.శివారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నాయి.


