పాలనలో మార్పు రావాలి..
I
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతోంది. దేశం అన్నిరంగాల్లో ముందుకుసాగుతున్నా.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలనలో మరింత మార్పు రావాల్సిన అవసరం ఉంది. అవినీతికి తావులేని పారదర్శక, సమర్థవంతమైన ప్రజాపాలన అందాలి. పోలీస్, న్యాయవ్యవస్థల్లో సంస్కరణలు రావాలి. మహిళలకు సత్వర న్యాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలి. మారుమూల గిరిజన గూడెంలలో కూడా సాంకేతికత అందుబాటులోకి రావాలి. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజల జీవితాల్లో మరింత మెరుగైన మార్పే లక్ష్యంగా పాలన సాగాలని యువత ఆకాంక్షిస్తోంది. – చాతుర్య, డిగ్రీ విద్యార్థిని, నారాయణపేట
ఆగస్టు 15 వస్తే ఇప్పటికీ పండగ గుర్తుకొస్తుంది. దసరా, దీపావళి మాదిరిగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకునేవాళ్లం. ఆ రోజు ఊరంతా ఒకచోట చేరి జాతీయ జెండా ఎగురవేసి, మిఠాయిలు పంచుకునేవాళ్లం. అనంతరం సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలపై చర్చించి, అవసరమైన తీర్మానాలు చేసుకునేవాళ్లం. ఇన్నేళ్ల స్వాతంత్య్రంలో గతంతో పోలిస్తే ప్రజల్లో స్వార్థం పెరిగింది. గతంలో ‘మన ఊరు.. మన ప్రాంతం’ అనే భావన ఉండేది. ఇప్పుడు ‘నాకేమిస్తారు?’ అనే ధోరణి కనిపించడం బాధ కలిగిస్తోంది. 25 ఏళ్లుగా దేశంలో అభివృద్ధి వేగం పుంజుకుంది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గానే ఉన్నా.. పల్లెలు ఇంకా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. – రంగారావు, తెలంగాణ పోరాట యోధుడు, మాజీ జెడ్పీటీసీ
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత
నీతి, నిజాయితీగా
పనిచేయాల్సిన
రంగాలు?
పల్లెలు మరింత అభివృద్ధి చెందాలి..


