ఆధునిక సాగు పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాగు పద్ధతులు పాటించాలి

Aug 15 2026 2:03 AM | Updated on Aug 15 2026 2:03 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని జాజాపూర్‌ రైతువేధికలో ఆత్మ ఆధ్వర్యంలో బ్లాక్‌ ఫార్మర్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కమిటీ ప్రధాన బాధ్యతలు, రైతుల సమస్యల గుర్తింపు, వ్యవసాయరంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లడం, వారి అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించేందుకు సూచనలు చేయడం, ప్రభుత్వ వ్యవసాయ పథకాల అమలును సమీక్షించడం, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ సలహాలు అందించడం ప్రధాన బాధ్యతల్లో భాగమని వివరించారు. అనంతరం ఆత్మ డిప్యూటీ డైరెక్టర్‌ శాంతినిర్మల మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధరంగాలైన ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ తదితర శాఖాలతో సమన్వయం చేసుకుంటూ రైతులను ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నరేష్‌, వ్యవసాయశాఖ అధికారులు దినకర్‌, నవీన్‌కుమార్‌, బాలాజీ ప్రసాద్‌, రహమన్‌, బీఎఫ్‌ఏసీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

నీట్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మరికల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి బి.నాగమణిమాల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని చిలుకూరు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ ఫౌండేషన్‌లో బాలురు, మహేంద్రహిల్స్‌ ఫౌండేషన్‌లో బాలికలకు వేర్వేరుగా శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరం బైపీసీలో ఉత్తీర్ణులై నీట్‌–2026 పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు అర్హులని తెలిపారు. వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ఫారాలు తీసుకొని 22వ తేదీలోగా నారాయణపేట డీసీఓ లేదా మరికల్‌ గురుకుల పాఠశాలలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్‌ 63045 73781 సంప్రదించాలని సూచించారు.

గురుకుల సీట్ల భర్తీకి..

సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి నాగమణిమాల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరికల్‌, దామరగిద్ద, నారాయణపేట, మక్తల్‌, మద్దూర్‌, ఉట్కూర్‌ గురుకులాల్లో మొత్తం 130 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు నారాయణపేట గురుకుల పాఠశాలలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement