నర్వ: ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అవసరమైన సందర్భాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. డయల్ 100, 112 ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట మరికల్ సీఐ భగవంత్‌రెడ్డి, ఎస్‌ఐ పబ్బతి రమేష్ తదితరులు ఉన్నారు.


