వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర గొప్పది | - | Sakshi
Sakshi News home page

వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర గొప్పది

Aug 1 2026 1:07 AM | Updated on Aug 1 2026 1:07 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: పాఠశాల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు, జిల్లా వైద్యాధికారి డా. జయంచంద్రమోహన్‌ అన్నారు. మండలంలోని జాజాపూర్‌ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు మూడురోజుల ప్రత్యేక శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించగా.. వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు రోజు యోగా, వ్యాయామం చేసే లా వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు శారీరకంగా ధృఢంగా కా వాలన్నా, క్రీడారంగంలో వారికంటూ ఓ గుర్తింపు రావాలన్నా వ్యాయామ ఉపాధ్యాయుల పాత్రే కీలకమన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ విజయ్‌కుమార్‌, డిస్ట్రిక్‌ రిసోర్సుపర్సన్‌ బాలరాజు, నర్సింహారెడ్డి, వెంకటేష్‌, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

పాత పింఛన్‌ పునరుద్ధరించాలి

నర్వ: ఉపాధ్యాయుల సామాజిక భద్రతతో ముడిపడి ఉన్న పాత పింఛన్‌ పునరుద్ధరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఉన్నత పాఠశాల, కేజీబీవీ, పెద్దకడ్మూర్‌, కల్వాల్‌, పాతర్చేడ్‌, ఉందేకోడ్‌ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయులకు సభ్యత్వ నమోదు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు 31లోపు ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులను ఏకం చేసి పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పల్లె వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సూరం వెంకటేష్‌, కార్యదర్శి హరీశ్‌, గౌరవ అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు మల్లేష్‌, సత్యనారాయణరెడ్డి, సదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement