మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్‌లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ తెలిపారు. వీరికి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికయ్యే క్రీడాకారులు మహారాష్ట్ర షిరిడీలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి గోగేమ్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు.


