నారాయణపేట: అత్యవసర సమయాల్లో వేగవంతమైన సేవలు అందించడంలో వాహనాలు కీలకమని ఏఎంవీఐ గౌతమ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం నారాయణపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌న్ పరిధిలోని పోలీసు వాహనాలను ఎంటీఓ ఆర్‌ఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల సాంకేతిక స్థితి, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ఇంజిన్, బ్రేకులు, స్టీరింగ్, టైర్లు, బ్యాటరీ, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, సైరనన్, ఎమర్జెన్సీ లైట్లు, హారన్ తదితరాలను పరిశీలించారు. ఫిట్‌నెస్, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు, బీమా, రిజిస్ట్రేషనన్ తదితర పత్రాలను కూడా చూశారు. లోపాలున్న వాహనాలకు వెంటనే మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వాహనాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రెగ్యులర్ సర్వీసింగ్, ఇంధన వినియోగం, నిర్వహణ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలన్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా, సురక్షితంగా వాహనాలు నడపాలని సూచించారు. పోలీసు వాహనాలు సాంకేతికంగా పటిష్టంగా ఉంటే నేర నియంత్రణ, గస్తీ, బందోబస్తు, అత్యవసర స్పందనలో మరింత సమర్థవంతంగా సేవలందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.


