ఉపాధి సిబ్బంది పోరుబాట | - | Sakshi
Sakshi News home page

ఉపాధి సిబ్బంది పోరుబాట

Aug 1 2026 1:07 AM | Updated on Aug 1 2026 1:07 AM

అమరచింత: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లి గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న వీబీజీ రాంజీ పథకం తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ల సాధనకు పెన్‌డౌన్‌–షట్‌డౌన్‌ కార్యక్రమంతో ఈ నెల 27 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురైనట్లు అయింది. 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రభుత్వం నేటికీ క్రమబద్ధీకరించకపోవడం, పనికి తగిన వేతనం చెల్లించకపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులు వీబీజీ రాంజీ పథకం అమలైనా.. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనబాట పట్టారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 4 వరకు వివిధ రకాల ఆందోళనతో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని రోజువారీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈ నెల 27న ఎంపీడీఓలు, డీఆర్డీఓ, కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించి ఆందోళనకు దిగిన తాత్కాలిక ఉద్యోగులు తమ హక్కుల సాధనకు విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. మండలస్థాయిలో కేవలం కార్యాలయానికి మాత్రమే పరిమితమవుతూ పెన్‌డౌన్‌.. షట్‌డౌన్‌ చేస్తున్నారు.

దామరగిద్దలో

నల్లబ్యాడ్జీలు ధరించి

నిరసన తెలుపుతున్న వీబీజీ రాంజీ

ఉద్యోగులు

వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల పెన్‌డౌన్‌.. షట్‌డౌన్‌

కార్యాలయాలకే పరిమితమైన సిబ్బంది

ముందుకుసాగని వన మహోత్సవం

ఆగస్టు 15 నాటికి సమస్యలుపరిష్కరించాలని డిమాండ్‌

ఉమ్మడి జిల్లాలో 653 మంది ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement