సెప్టెంబర్‌ 12న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 12న జాతీయ లోక్‌ అదాలత్‌

Jul 26 2026 3:26 AM | Updated on Jul 26 2026 3:26 AM

నారాయణపేట: రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కో–ఆర్డినేషన్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సెప్టెంబర్‌ 12న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయా లని సూచించారు. జూన్‌ 20న నిర్వహించిన జాతీ య లోక్‌ అదాలత్‌లో 5,300 కేసులను పరిష్కరించి రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచామని.. ఇందుకు కృషి చేసిన న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. సెప్టెంబర్‌ 12న జరిగే లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగిన కేసుల ను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ముఖ్యంగా జైళ్లలో ఉన్న ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులకు సూచించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులపై చర్యలు యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు.

పోక్సో కేసులపై ఆరా..

భరోసా, సఖికేంద్రాల సిబ్బందితో మాట్లాడిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోక్సో కేసుల్లో తప్పనిసరి నివేదికలు, బాధితుల గుర్తింపు రక్షణ, ఫాస్ట్‌ ట్రయల్స్‌ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కం సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి బి.సాయిమనోజ్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సుష్మిత, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి అవినాష్‌, డీఎస్పీ లింగయ్య, డీఈఈ రాములు, సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement