కేసులు నమోదు చేస్తే తాటతీస్తా..
● మంత్రి గారు నోరు అదుపులో పెట్టుకో..
● హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్: రైతాంగ సమస్యలపై రాస్తారోకో చేస్తున్న రైతులపై, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై మంత్రి వాకిటి శ్రీహరి పోలీసులకు చెప్పి కేసులు నమోదు చేయించడం జరిగిందని, ఇలాంటి పనులు చేస్తే తాట తీస్తామని, ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం మక్తల్‌లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మక్తల్ ట్యాంకుబండ్ దగ్గర చేస్తున్న పనులు చేపట్టడం సరియైందికాదన్నారు. రాస్తారోకో చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస కార్యకర్తలపై మంత్రి వాకిటి శ్రీహరి పోలీసులకు చెప్పి కేసులు నమోదు చేయించడం జరిగిందన్నారు. మంత్రి గారు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. గతంలో ట్యాంకు బండ్ కోసం రూ.4.50 కోట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి పనులు చేయడం జరిగిందన్నారు. పార్కు కోసం మున్సిపాల్టీలో తీర్మానం చేసి నిర్మాణం కోసం రూ.కోటి 40 లక్షలు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసు నమోదు చేస్తే కక్ష పూరితమైన రాజకీయ చర్యలకు నిదర్శనమన్నారు. లేనిపోని మాటలు అడితే తగిన పరిణమాలు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. సమావేశలలో మార్కెట్ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు అన్వర్, మొగులప్ప, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, ఈశ్వర్‌యాదవ్, నేతాజీరెడ్డి, శివారెడ్డి, మన్నన్ పాల్గొన్నారు.


