జాతీయ స్థాయికి పేట విద్యార్థి
నారాయణపేట రూరల్: మద్దూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లికి చెందిన కనకప్ప కుమారుడు శ్రీకాంత్ నారాయణపేట పట్టణంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17 విభాగంలో సబ్ జూనియర్ కబడ్డీలో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. దీంతో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల చివరలో హర్యానాలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొంటాడని పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. కళాశాల యాజమాన్య సభ్యులు, అధ్యాపకులు శ్రీకాంత్‌ను అభినందించారు.


