ఉద్యోగ భద్రత ఉండదు..
2014 కంటే ముందు నుంచి చాలామంది విధులు నిర్వహిస్తున్నారు. వారిని నేరుగా యూనివర్సిటీ నియమించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీఓలో నేరుగా ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నట్లు ఉంది. కనీసం సిబ్బందికి చెప్పకుండా ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తే ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. కాంట్రాక్టు విధానం లేదా నేరుగా యూనివర్సిటీ కింద కొనసాగిస్తూ జీఓ ప్రకారం వేతనాలు ఇస్తే చాలు.
– రామ్మోహన్, పీయూ నాన్‌టీచింగ్ సంఘం అధ్యక్షుడు
ఈ అంశాన్ని పరిశీలిస్తాం..
పీయూలో నాన్‌టీచింగ్ సిబ్బంది ఔట్‌సోర్సింగ్ అంశాన్ని పరిశీలిస్తాం. వారు వినతిపత్రం ఇస్తే దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ
●


