57 ఏళ్ల తర్వాత తీవ్రమైన కరువు | - | Sakshi
Sakshi News home page

57 ఏళ్ల తర్వాత తీవ్రమైన కరువు

Sep 26 2026 2:08 AM | Updated on Sep 26 2026 2:08 AM

57 ఏళ్ల తర్వాత తీవ్రమైన కరువు

సరిగ్గా 57 ఏళ్ల తర్వాత 2026లో మళ్లీ తీవ్రమైన కరువు ప్రజలపై విరుచక పడింది. 1969లో కరువు వచ్చింది. అప్పట్లో నేను గుంటూరులో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదవివేవాడిని. అప్పుడు నాకు 17 ఏళ్లు. మొదటిసారిగా కరువు చూశాను. నాటి కరువుతో పోల్చుకుంటే ఈ ఏడాది ఏర్పడిన కరువు తీవ్రత మాటల్లో చెప్పలేనిది. మేము పత్తి 10 ఎకరాల్లో సాగు చేశాం. వర్షాలు లేకపోవడం వల్ల పంట మొత్తం ఎండిపోయింది. పత్తి పంటను మొత్తం ట్రాక్టరుతో దున్నేశాం. 1969లో కూడా అంతే. ఆ ఏడాది జూన్‌ నెలలో కొంత మేర వర్షాలు కురిశాయి. విత్తనం వేసుకున్న తర్వాత సెస్టెంబరు నెల వరకు వర్షాలు లేవు. పంటలన్నీ దున్నేసుకున్నారు. అయితే రబీ పంటల సాగుకు అనువుగా వర్షాలు కురిశాయి.

– వెంకట సుబ్బారెడ్డి, పాలకొలను,

ఓర్వకల్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement