చుట్టూ నీరు ఉన్నా పంటలు పండక తీవ్ర నష్టాలు రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరిగి నిత్యావసరాలు కొనుగోలు లేక సామాన్య ప్రజలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆసరా లేక, పింఛన్లు అందక వృద్ధుల, దివ్యాంగుల బతుకు భారంగా మారింది. ఉద్యోగాలు లేక, న | - | Sakshi
Sakshi News home page

చుట్టూ నీరు ఉన్నా పంటలు పండక తీవ్ర నష్టాలు రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరిగి నిత్యావసరాలు కొనుగోలు లేక సామాన్య ప్రజలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆసరా లేక, పింఛన్లు అందక వృద్ధుల, దివ్యాంగుల బతుకు భారంగా మారింది. ఉద్యోగాలు లేక, న

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీకి చంద్రబాబు కేబినెట్‌ ఆమోదం

ఐటీడీపీ సభ్యులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే లక్ష్యం

ప్రజా సమస్యలు గాలికి వదలి టీడీపీ కేడర్‌కు పథకాలు

ప్రజాధనం దోపిడీకి ‘పచ్చ’రంగు పూస్తున్న వైనం

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు

● ఓటుహక్కు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇప్పటి వరకు అమలు చేయలేదు.

● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని మోసం చేశారు.

● యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయలేదు.

● పేదలను సంపన్నులు చేస్తామని ‘పూర్‌ టు రిచ్‌’ అని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పీ4 పథకాలు అమలు చేయలేదు.

● యువత కోసం డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి అటకెక్కించారు.

● వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చి మరచిపోయారు.

● స్వయం సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదు.

● ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేస్తామని మోసం చేశారు.

.. ఇవే కాదు చాలా హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాటిలో కొన్ని అమలు చేస్తున్నా పెద్ద ఎత్తున కోతలు పెడుతున్నారు. అన్నదాత సుఖీభవ, గ్యాస్‌ సిలిండర్ల హామీ సక్రమంగా అమలు కావడం లేదు.

సాక్షి ప్రతినిధి,కర్నూలు: తప్పుడు దివ్యాంగ, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లతో లోకేశ్‌ యువగళం సభ్యులకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రజాధనంతో ఐటీడీపీ సభ్యులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమైంది. సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీ పేరుతో ఈ సరికొత్త దోపిడీ పథకానికి రంగం సిద్ధం చేసింది. పచ్చపార్టీ సానుభూతిపరులైన సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లను గుర్తించి వారిని ఎం ప్యానెల్‌ చేసే విధంగా ప్రభుత్వం సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీకి ఆమోదం తెలిపింది. పేరుకు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ విధానం ఉద్దేశం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వీరిని ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ఎంప్యానెల్‌ చేయనున్నారు. ఈ విధానం ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు వర్తిస్తుంది. ప్రారంభ ఎంప్యానెల్‌ ఒక సంవత్సరం ఉంటుంది. దీనిని మరింతగా పొడిగించవచ్చు. లక్ష వ్యూస్‌కు రూ.15 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల వరకు చెల్లించే అవకాశముంటుంది. బుధవారం రాష్ట్రమంత్రి వర్గం ఈ కొత్త పథకానికి ఆమోదం తెలిపింది.

ఐటీడీపీకి ఆర్థిక లబ్ధి కోసమే!

వాస్తవానికి ఐటీడీపీలో పనిచేస్తున్న వారికి నేరుగా ప్రభుత్వం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి నాంది పలికిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీరుపై విద్యార్థి, నిరుద్యోగ యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ఇప్పటికే లోకేశ్‌ యువగళం సభ్యులకు అత్యంత కీలకమైన ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం అక్రమ పద్ధతిలో కట్టబెట్టింది. నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్లతోపాటు స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లతో టెట్‌కు క్వాలిఫై కాకున్నా పెద్ద ఎత్తున ఉద్యాగాలు ఇచ్చింది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలు పెద్ద ఎత్తున వెలుగు చూశాయి. ఇదే పద్ధతిలో అటు పోలీసు ఉద్యోగ నియామకాల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను గాలికి వదిలి టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీ పథకానికి రూపకల్పన చేసినట్లు విమర్శలు వినపడుతున్నాయి. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలోనే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇన్‌ప్లుయెన్సర్లు ఉన్నారు. వీరిలో టీడీపీకి చెందినవారు లక్షల్లోనే ఉంటారు. మరో వైపు ఐటీడీపీ సభ్యలు పెద్ద మొత్తంలో ఉన్నారు. వారందరికీ నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీకి ఆమోదం తెలిపిందన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వం తీరుపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హామీలు తుంగలో తొక్కి..

కరువు కోరల్లో ప్రజలు

సకాలంలో వర్షాలు లేక, ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ప్రజలు కరువు కోరల్లోచిక్కి అల్లాడిపోతున్నారు. రాబోయే కాలంలో తిండిగింజలు, పశుగ్రాసం దొరికే పరిస్థితి కానరావడం లేదు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం గ్రాసం కూడా అందించే పరిస్థితిలేకుండా పోయింది. కానీ టీడీపీ కార్యకర్తలకు మాత్రం ఆర్థిక లబ్ధి చేకూరచేందుకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement