● ప్రజాధనంతో టీడీపీ ఇన్‌ప్లుయెన్సర్లకు జీతాలా? ● మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి
బొమ్మలసత్రం: దొంగ హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్‌రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో 29 నుంచి 42వ వార్డు పార్టీ నాయకులతో సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శిల్పరవితో పాటు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అబద్ధాలతోనే 40 ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. పేదలకు సంక్షేమ పథకాల ఆశ చూపి దగా చేయటం సరికాదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అనుకూలంగా సోషల్‌మీడియా ప్రచారానికి అధికారికంగా ప్రచారం చేసేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దేశం సుధాకర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట జనరల్ సెక్రెటరీ శశికళారెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బొల్లెద్దుల రవికుమార్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు టీవీ రమణ, అసెంబ్లీ యూత్ అధ్యక్షులు శ్రీనివాసులు, చేనేత విభాగం నంద్యాల అధ్యక్షులు సుబ్బరాయుడు, మాజీ కౌన్సిలర్లు బాషిద్, జాకీర్, లక్ష్మినారాయణ, పున్నాశేషయ్య, వెంకట సుబ్బయ్య గౌడ్, నాయకులు భాస్కర్‌రెడ్డి, ఎద్దురవి, రామచంద్రుడు, యూనిస్, కిరణ్, అశోక్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, వెంకటరెడ్డి, తిక్కారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చల్లా సత్యం, మాబాషా, డాక్టర్ మనోజ్, వెంగళరెడ్డి, పైలెట్ తదితరులు పాల్గొన్నారు.


