నేటి నుంచి నంద్యాల జిల్లా పరిషత్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నంద్యాల జిల్లా పరిషత్‌

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

● ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌

● ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌

నంద్యాల(అర్బన్‌): జిల్లాల పునర్విభజనలో నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు ఇక నుంచి జిల్లా పరిషత్‌ ఏర్పాటుకానుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేళ్ల క్రితం ఏర్పడిన పాలక మండలి ఈనెల 24వ తేదీతో ముగిసింది. దీంతో నేటి (శుక్రవారం) నుంచి నంద్యాల జిల్లా పరిషత్‌ అమలులోకి రానుంది. జిల్లా ప్రజా పరిషత్‌ పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన అధికారిక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటైన ఎమ్మార్సీ భవనంలో శుక్రవారం నంద్యాల జిల్లా ప్రజాపరిషత్‌ (జెడ్పీపీ) పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు జిల్లా ప్రజాపరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుధాకర్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లా కలెక్టర్‌ రాజకుమారి జెడ్పీ ప్రత్యేక అధికారిణిగా ఉదయం 9.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement