కోవెలకుంట్ల: మహానేత జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులు ఆయా జిల్లాల రైతాంగానికి ఊపిరిలూదా యి. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ.70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు.దీని ద్వారా కర్నూలు,కడప జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్‌కు అనుసంధానంగా జీఎన్‌ఎస్‌ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు 30 వ ప్యాకేజీ కింద రూ.401 కోట్లతో 12 కిలోమీటర్ల మే ర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి 20 వేల క్యూసెక్కుల వరదజలాలను రిజర్వాయర్‌లో నింపు తున్నారు. వైఎస్సార్ కలల సాకారమైన అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది.


