సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం జరిగింది. నర్సమ్మ (30) అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్క్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విధులు నిర్వహిస్తున్న నర్సమ్మపై దాడి చేసిన దుండగులు.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలార్పి, 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.


