బోర్లు ఎండి.. కన్నీరు ఉబికి ! | - | Sakshi
Sakshi News home page

బోర్లు ఎండి.. కన్నీరు ఉబికి !

Sep 3 2026 8:53 AM | Updated on Sep 3 2026 8:53 AM

రుణుడి జాడ లేదు. వాగులు, వంకలు ఎండిపోయాయి. బోర్లలో భూగర్భ జలాలు అడుగంటాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటకు అందిస్తున్నారు. ఆవులదొడ్డి గ్రామంలో సుధాకర్‌ అనే రైతు 3 ఎకరాల్లో ఉల్లి సాగుకు ఇప్పటి వరకు సుమారు రూ.7 లక్షలు వెచ్చించాడు. పంట చేతికొచ్చే సమయంలో నీరు అందక రోజుకు రూ.12 వేల చొప్పున ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నాడు. మరో 30 రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటే అదనంగా రూ.3 లక్షలు ఖర్చవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో చాలా మంది రైతుల పరిస్థితి ఇలానే ఉందని, పెట్టిన పెట్టుబడులు పోతాయన్న భయంతో అప్పులు చేసి మరీ నీటిని కొనుగోలు చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వ తక్షణమే స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలని ఆవులదొడ్డి గ్రామ మాజీ స్పరంచ్‌ మద్దిలేటి డిమాండ్‌ చేశారు.

– డోన్‌ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement