జిల్లా ఓటర్లు 12,25,937 | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఓటర్లు 12,25,937

Aug 1 2026 12:22 AM | Updated on Aug 1 2026 12:22 AM

పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

నంద్యాల(అర్బన్‌): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ జూన్‌ 15 నుంచి ప్రారంభమై జూలై 24తో పూర్తయింది. ముసాయిదా జాబితాను శుక్రవారం జిల్లా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆ ప్రకారం జిల్లాలో 12,25,937 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,01,281 మంది, మహిళలు 6,24,458 మంది, ఇతరులు 198 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 23,177 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

తొలగింపుల్లో నంద్యాలలో అత్యధికం

బీఎల్‌ఓలు నిర్వహించిన ఇంటింటి సర్వేలో నంద్యాల నియోజకవర్గంలో అత్యధికంగా 52,307 మంది ఓటర్లను తొలగించారు. అత్యల్పంగా నందికొట్కూరు నియోజకవర్గంలో 23,204 మంది ఓటర్లను తొలగించారు. సర్వేలో ఓట్లను తొలగించిన అధికారులు పోలింగ్‌ కేంద్రాలను హేతుబద్ధీకరించారు. గతంలో ఆరు నియోజకవర్గాల పరిధిలో 1,629 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా ప్రస్తుతం 134 పోలింగ్‌ స్టేషన్లు పెంచడందో 1,763 అయ్యాయి.

ఆగస్టు 30వ తేదీ వరకు

అభ్యంతరాల స్వీకరణ

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 12,25,937 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి రామునాయక్‌ శుక్రవారం తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించామని, అభ్యంతరాలు, దరఖాస్తులను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు స్వీకరిస్తామన్నారు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారానికి సెప్టెంబర్‌ 28 వరకు గడువు ఉందన్నారు. అక్టోబర్‌ 3న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ, బీఎల్‌ఓ, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని రావచ్చన్నారు.

సర్‌లో తొలగించిన

ఓటర్ల సంఖ్య 1,79,506

ముసాయిదా జాబితా విడుదల చేసిన

ఎన్నికల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement