రైల్వే ప్రయాణికులకు ‘అమృత్‌’ సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు ‘అమృత్‌’ సౌకర్యాలు

Aug 1 2026 12:22 AM | Updated on Aug 1 2026 12:22 AM

తూర్పు కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌

సందీప్‌ మాధుర్‌

బొమ్మలసత్రం: అమృత్‌ భారత్‌ పథకం ద్వారా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాధుర్‌ తెలిపారు. నంద్యాల రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఒప్పందాల ప్రకారం దక్షిణ మధ్య రైల్వే రెండు భాగాలు విడిపోయిందన్నారు. తూర్పు కోస్తా రైల్వే ప్రథమ జనరల్‌ మేనేజర్‌గా జూన్‌ 1న తాను భాధ్యతలు స్వీకరించాన్నారు. నంద్యాల నుంచి గుంటూరు వరకు కేంద్రప్రభుత్వం అమృత్‌భారత్‌ పథకం ద్వారా అన్ని రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్‌లలో అభివృద్ధి పనులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తాను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నానని తెలిపారు. రన్నింగ్‌ రూమ్‌, క్రూ లాబీ, స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయాలను సందర్శించి పలు సూచనలు చేశారు. జనరల్‌ మేనేజర్‌తో పాటు ప్రిన్సపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ రాజ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వినీత్‌కుమార్‌, గుంటూరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ సుధేష్ణసేన్‌, అధికారులు శ్రీనివాస్‌, రవితేజ, ప్రదీప్‌కుమార్‌, రవితేజ, రత్నాకర్‌, చంద్రశేకర్‌, లయన్‌ రవిప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement