ఓటరు జాబితాపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాపై అప్రమత్తత అవసరం

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

బీఎల్‌ఏలతో మాజీ ఎమ్మెల్యే

కాటసాని రామిరెడ్డి

బనగానపల్లె: ఎస్‌ఐఆర్‌ సర్వేలో చివరి ఓటరు జాబితా ప్రచురితమయ్యే వరకు వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సూచించారు. బనగానపల్లె పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సర్‌ డ్రాఫ్ట్‌ రోల్‌ ప్రక్రియపై ఆదివారం అవుకు, బనగానపల్లె మండలాల బూత్‌లెవల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ)తో కాటసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐర్‌ ప్రక్రియలో ఇప్పటి వరకు వెరిఫికేషన్‌ పూర్తయిందని, తర్వాత ఎన్‌రోల్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 31న డ్రాఫింగ్‌ లిస్ట్‌ వస్తుందని, అప్పుడు 18 సంవత్సరాలు నిండిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను ఫారం–6 ద్వారా చేర్పించేందుకు ప్రతి బూత్‌లో బీఏల్‌ఏలు శ్రమించాలన్నారు. నియోజకవర్గంలో 2,43,491 ఓటర్ల ఉండగా ఇందులో 25,901 మంది ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదన్నారు. బనగానపల్లె మండలంలో 9,020 మంది, అవుకు మండలంలో 4,450 మంది ఓటర్లు వివిధ కారణాలతో తొలగించినట్లు తెలుస్తోందన్నారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క హమీ నేరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అవుకు బనగానపల్లె మండలాల కన్వీనర్లు కాటసాని తిరుపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు గోపవరం గోపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు అంబటిరవి కుమార్‌రెడ్డి, కుమ్మరి సురేష్‌, ఈశ్వర్‌నాయక్‌, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, బీఎల్‌ఏల నియోజకవర్గ అధ్యక్షులు తల్లం సుబ్రమణ్యం, స్థానిక నాయకులు సంజీవగౌడ్‌, సాంబశివా రెడ్డి, వడ్డె వెంకటేశ్వర్లు, తులసీరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, జీటి వెంకట్రామిరెడ్డి సాయినాథ్‌రెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, రోబో, సంగపట్నం అంజీ సుబ్బారెడ్డి, రామేశ్వరరెడ్డి, విరుపాక్షిరెడ్డి, సుంకేసుల పార్థసారధిరెడ్డి, సాదక్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement