పచ్చని పంట జీవాలకు పశుగ్రాసం | - | Sakshi
Sakshi News home page

పచ్చని పంట జీవాలకు పశుగ్రాసం

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

జూపాడుబంగ్లా: వర్షాభావ పరిస్థితులతో గిడస బారిన మొక్కజొన్న పంటను రైతు జీవాలకు మేతగా వదిలేశాడు. జూపాడుబంగ్లాకు చెందిన రైతు రామకృష్ణ ఎకరాకు రూ.20 వేలు ముందస్తు కౌలు చెల్లించి నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. జూన్‌లో కురిసిన వర్షాలకు విత్తనాలు, ఎరువులు, సేద్యం ఖర్చు కలుపుకొని ఎకరాకు రూ.20 వేలు వెచ్చించి మొక్కజొన్న పంటను సాగుచేశాడు. పొలంలో రెండు బోర్లు ఉన్నా వర్షాలు లేక పోవటంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో పంట గిడసబారి పోయి దిగుబడి చేతికందదనే ఉద్దేశంతో రైతు శనివారం జీవాలకు మేతగా వదిలేశాడు. దీంతో అతనికి రూ. 1.60 లక్షల నష్టం వాటిల్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement