సంస్కృతి, సంప్రదాయాలు.. తరతరాలుగా పెద్దలు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జీవన విధానం. వాటని పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో కొలువైన మూలపెద్ద ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి మొక్కుగా, పక్షులకు ఆహారంగా ఉంటాయని నేటికి రైతులు జొన్నకంకులను కడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. గతంలో ప్రతి ఇంటి ముంగిట ఇలా కంకులను కట్టేవారు. దీంతో రామచిలుకలు, పిట్టలు వచ్చి వాటిని తింటుంటే అందరూ ఆసక్తిగా తిలకించేవారు. ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలు కనిపించడం లేదు.
– దొర్నిపాడు


